ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో కందిపప్పును సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరిపడా స్టాక్ ను చేరవేసింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 150- రూ. 180 వరకు ఉండగా, రేషన్ షాపుల్లో రూ. 67 కు అందిస్తోంది. కందిపప్పుతో పాటు చక్కెర, గోధుమపిండిని కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

AP Govt good news for ration card holders

ఇక అటు నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి వచ్చే వారం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగే సుదీర్ ఎక్స్ లో వెల్లడించారు. వచ్చే బుధవారం అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలు సమర్పిస్తాయని తెలిపారు. జీవో 77 అమలుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news