ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం.. అప్పటి నుంచే అమలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ లేకుండా చేసేందుకు భారీ ప్లాన్ చేసింది. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లను నిషేధించబోతున్నట్లు ప్రకటన చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఈ నిషేధం అమలు చేయబోతున్నారు. ముందుగా సచివాలయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

CM Chandrababu

ఆగస్టు 10వ తేదీ నుంచి ఏపీ సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లను తీసుకురాకూడదని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి సెక్రటేరియట్ లోకి పూర్తిస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రీయూజబుల్ బాటిల్స్ ను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది  ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news