ఆరోగ్య శ్రీ పథకం లో సరికొత్త సేవలు

-

ఆరోగ్య శ్రీ పథకం లో సరికొత్త సేవలు తీసుకొచ్చామని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్రకటించారు. జ‌గ‌న‌న్న సంక‌ల్పానికి కార్పొరేట్ ఆస్ప‌త్రుల స‌హ‌కారం తోడైతే అద్భుతాలు చేయొచ్చ‌ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. గుంటూరులోని శ్రీ ఆస్ప‌త్రి స‌హ‌కారంతో చిల‌క‌లూరిపేట ఏరియా ఆస్ప‌త్రిలో రూ.20 ల‌క్ష‌ల వ్య‌వ‌యంతో అత్య‌వ‌స‌ర విభాగాన్ని ఆధునికీక‌రించారు. స్మార్ట్ స‌దుపాయ‌లు క‌ల్పించారు.

కెమెరా, ప్ర‌త్యేకంగా యాప్‌, రోగుల‌ను 24 గంట‌లూ వీడియో రూపంలో ప‌ర్య‌వేక్షించేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు, రోగి అరోగ్య ప‌రిస్థితి అదుపుత‌ప్పే స‌మ‌యంలో అప్ర‌మ‌త్తం చేయ‌డం లాంటి ఆధునిక ఫీచ‌ర్ల‌తో చిల‌క‌లూరిపేట‌లో ఐసీయూ విభాగాన్ని శ్రీ ఆస్ప‌త్రి అభివృద్ధి చేసింది. ఈ విభాగాన్ని తాజాగా మంత్రి ప్రారంభించారు. పేద‌ల‌కు మ‌రింత నాణ్యంగా ఉచితంగా వైద్య సేవ‌లు అందించేందుకు ఈ స్మార్ట్ ఐసీయూ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. ఏడాదికి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఈ ఐసీయూ నిర్వ‌హ‌ణ‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని, ఆ మొత్తం కూడా శ్రీ ఆస్ప‌త్రి వారే ఖ‌ర్చు చేస్తుండ‌టం గొప్ప విష‌య‌మ‌ని తెలిపారు. చిల‌క‌లూరిపేట ఏరియా ఆస్ప‌త్రిని మ‌రింత గొప్ప‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ఆస్ప‌త్రి అధినేత క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి గారిని స‌న్మానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version