EVM ల వ్యవహారంలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..!

-

EVMల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది కోర్టు. పిటిషన్ పై వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.

అయితే వీవీ ప్యాట్లు లెక్కించాలని సుప్రీం కోర్టు తీర్పులో చెప్పలేదని కోర్టుకు తెలిపారు ఎన్నికల సంఘం న్యాయవాది. వీవీ ప్యాట్లను లెక్కించి ఈవీఏంలలో ఓట్లను సరిపోల్చలని సుప్రీం కోర్టు తీర్పులో చెప్పలేదని కోర్టుకు దృష్టికి తెచ్చిన ఎన్నికల సంఘం న్యాయవాది.. ఈవీఏం లలో ఉన్న సాప్ట్ వెర్ టెంపరింగ్ ఏమైనా జరిగిందా అని టెక్నికల్ టీంతో చెక్ చేయాలని మాత్రమే చెప్పినట్టు కోర్టుకు తెలిపారు. ఈవీఏం, వీవీ ప్యాట్ల స్లిపులను రెండు లెక్కించాలనీ సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా ఎన్నికల సంఘం మాక్ పోలింగ్ కు ఆదేశాలు ఇచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు బాలినేని న్యాయవాది. మాక్ పోలింగ్ ఆదేశాలు ఈసీ రద్దు చేసి వీవీ ప్యాట్లు, ఈవీఏంలలో ఓట్లు సరిపోల్చాలనీ కోరారు బాలినేని లాయర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version