అంతర్వేది ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఘటన పై సీబీఐచే విచారణకు అదేశించామన్న ఆమె త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తామని అన్నారు. రథం తగలపడటం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానంగా ఉందని, కొంతమంది కావాలనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన రెండు, మూడు అంశాలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే కుట్ర కోణం అనుమానాలు మరింత బలపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఏమైనా సీబీఐ ఎంక్వైరీలో అన్నీ వాస్తవాలు తేలుతాయని అన్నారు. ఈ ఘటనకు కులాల రంగు, మతాల రంగు పూస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్వేది ఘటన పై సీరియస్ గా ఉన్నారని ఈ ఘటనకు కారణం అయినవారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. ఇక కరోన పై సమరంలో పోలీసులు కీలకంగా పనిచేశారన్న ఆమె ప్రభుత్వం అమరులైన పోలీసులకు 50 లక్షల బీమా కల్పించడం జరిగిందని అన్నారు. నిరంతరం పోలీసులకు హెల్త్ క్యాంప్ లు పెడుతున్నామని ఆమె అన్నారు. దేశం లొనే తొలి సారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాదేనాన్న ఆమె దేశంలో ప్రతిభ, సాంకేతికతో మన పోలీసులు మన్నన లు పొందుతున్నారు.. వారిని అభినందిస్తున్నానని అన్నారు.