అంతర్వేది రథం దహనం ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితం ఈ కేసుని సిబిఐ కి అప్పగిస్తూ జీవో జరీ చేసింది సిఎం జగన్ ప్రభుత్వం. నిన్న సాయంత్రమే సిఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకుని డీజీపీ గౌతం సవాంగ్ కు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సవాంగ్ కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాసారు.
ఘటనపై సిబిఐ విచారణ చేయించాలని పేర్కొంటూ కాసేపటి క్రితం ఏపీ సర్కార్ జీవో ఇచ్చింది. ఇటీవల జరిగిన ఈ ఘటనపై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేసు విషయంలో సిఎం జగన్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ఇది కేవలం కుట్రే అంటూ విమర్శలు చేసాయి. నేడు చలో అంతర్వేది అనే కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. అంతర్వేది రథం దహనం ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితం ఈ కేసుని సిబిఐ కి అప్పగిస్తూ జీవో జరీ చేసింది సిఎం జగన్ ప్రభుత్వం. నిన్న సాయంత్రమే సిఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకుని డీజీపీ గౌతం సవాంగ్ కు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సవాంగ్ కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాసారు.