మహానగరంలో మాయ డాక్టర్.. ఏకంగా సీనియర్ ఐపిఎస్ లనే బోల్తా !

-

హైదరాబాద్ రాచకొండ లో నకిలీ డాక్టర్ తేజా రెడ్డి ఏకంగా పోలీసులనే మస్కా కొట్టించిన వైనం సంచలనంగా మారింది. నకిలీ సర్టిఫికెట్స్ తో పలు ప్రైవేట్ హాస్పిటల్ ల్లో డాక్టర్ గా విధులు కూడా నిర్వర్తించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో రాచకొండ పోలీసులకు డాక్టర్ నని చెప్పుకుని మందులు కూడా అందించాడు సదరు నకిలీ డాక్టర్. పోలీస్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించినట్టు తెలుస్తోంది. సీనియర్ ఐపిఎస్ లను సైతం బురిడీ కొట్టించిన ఈ నకిలీ డాక్టర్ వ్యవహారం రెండో భార్య పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్న తేజ రెడ్డి, రెండో భార్యను వేదింపులకు గురి చేయడంతో ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. అయితే ఒక రౌడీ షీటర్ కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనం గా స్టికర్ అంటించిన తేజ వ్యవహరం మీద పోలీసులకి అనుమానం రావడంతో ఆరా తీయగా తేజ రెడ్డి చరిత్ర బయట పడింది. బెంగుళూర్ లో సైతం ఇదే తరహాలో మోసం చేసి తాను ఏస్పీ అంటూ , సీనియర్ ఐపిఎస్ కుమారుడిని అంటూ పోలీస్ లకు మస్కా కొట్టగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైల్ కు తరలించారు. బెయిల్ పై విడుదల అయ్యాక హైదరాబాద్ కు మకాం మార్చాడు తేజ రెడ్డి. రాచకొండ కో వీడ్ కంట్రోల్ రూమ్ లో వాలంటీర్ గా విధులు కూడా నిర్వహించినట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version