చంద్రబాబు నిద్రపోవడం లేదు‌‌.‌.మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు – ఏపీ మంత్రి

-

ఏపీ మంత్రి నారాయణ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సీఎం చంద్రబాబు తాను నిద్రపోవడం లేదు‌‌.‌. మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదన్నారు మంత్రి నారాయణ. విజయవాడ పరిస్థితులుపై ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ… ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం కచ్చితంగా అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. శానిటేషన్ కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారని సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.

AP Minister Narayana on chandrababu

జగన్ ముందుగా వరద పై పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా.. ఇలాంటి పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలీకుండా మాట్లాడకూడదని ఆగ్రహించారు. గుంటూరు, భీమవరం, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రి మునిసిపాలిటీ ల నుంచీ వరద సహాయం పంపించారని… వరద బాధితులకు 6 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు, మంచినీళ్ళు అందిస్తున్నామన్నారు. వరద నీరు వెళ్ళిన ప్రతీచోటా హెల్త్, మునిసిపల్ సెక్రటేరీలతో క్లీనింగ్ మానిటర్ చేస్తున్నామని చెప్పారు. బుడమేరు మాత్రమే కాదు.. ఎక్కడైనా సరే.. ఇళ్ళు పోయిన వారికి వేరే చోట ఇళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news