ఏపీ మంత్రులా మజాకా… పోలీసులకు ఫుల్ పని!

-

వెదవపనుల్లో ప్రజాప్రతినిధులకు, పెద్దవాళ్లకు సంబందించిన వాళ్లెవరైనా దొరికితే.. వెంటనే సంబందిత మంత్రి నుంచి అధికారులకు ఫోన్ వెళ్లిపోతుందనేది అంతా అనుకునే మాట.. అందులో వాస్తవశాతం కూడా గరిష్టం! ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినంతకాలం.. అధికారులు ఎంత నిజాయితీగా పనిచేసినా, వారెన్ని టార్గెట్స్ పెట్టుకునా.. వారి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. ఈ క్రమంలో వారికి ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ ఎవరినుంచీ రావని, వచ్చినా స్పందిచొద్దని, అధికారులకు పూర్తి స్వేచ్చనిచ్చి లక్ష్యాలను నిర్ధేశించారు ఏపీ మంత్రులు!

వివరాళ్లోకి వెళ్తే… ఎర్రచందనం స్మగ్లింగ్‌ పై తాజాగా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ డియ్పూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వీరు స్పందించిన తీరు, పోలీసులకు ఇచ్చిన భరోసా అందరికీ సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి. ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా పటిష్టం చేయాలని, ఇకపై పీడీ యాక్టులు స్మగ్లింగ్ లో పనిచేస్తున్న కూలీలపై కాకుండా.. అందుకు మూలమైన యజమానులపై పెట్టాలని, అప్పుడే 90 శాతం స్మగ్లింగ్‌ ఆపగలమని నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసులకు తెలిపారు.

ఇదే క్రమంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ విషయంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని నారాయణస్వామి పేర్కొనగా… ఆ విషయంలో తన సొంత తమ్ముడైనా, బంధువైనా సరే వదిలిపెట్టవద్దని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఈ మాటలపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిద్ద్బందితో పాటు ప్రజల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాప్రనిధులు, మంత్రులు.. పోలీసులకు ఈ స్థాయిలో సపోర్ట్ గా ఉంటే.. వారి పనికి అడ్డురాకుండా ఉంటే… ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా… ఇలాంటి ఆలోచన చేసి, అమలుకు మద్దతు పలికిన మంత్రులకు మాత్రం… ఏపీ మంత్రులా మజాకా అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news