హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఉన్మాది చెలరేగిపోయాడు. సొంత అక్కల మీదనే కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కలు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వేత్తే..
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాలాకు చెందిన అహ్మద్ ఇస్మాయిల్ (27) మాజీ బౌన్సర్. తల్లి పుత్లీబేగంతో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా అహ్మద్ బా ఇస్మాయిల్ నిన్న ఉదయం 11 గంటలకు అక్కలు, బావ రజియానా, జగ్గీరా, ఉమర్ భా హసన్, నూరా బేగంపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు, సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మరోవైపు పరారీలో ఉన్న అహ్మద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇస్మాయిల్ గతేడాది భార్యను హత్య చేసిన కేసులో అరెస్ట్ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలైనట్టు తెలిపారు. సలాలకు సమీపంలో ఉన్న ఇస్మాయిల్ నాలుగో సోదరి మల్లికాబేగంను కూడా చంపేందుకు వారింటికి వెళ్లాడు. అయితే, దాడికి గురైన తన సోదరిని ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే ఆసుపత్రికి వెళ్లడంతో బతికిపోయింది.
ఇంటి వద్ద ఆమె లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పోలీసులను చూసి వెళ్లిపోయాడు. అక్కలు చెప్పిన మాటలు వినే తాను తన భార్యను చంపేశానని, ఇప్పుడు ప్రతీకారంగా వారిని చంపుతున్నట్టు దారిలో కనిపించిన ఓ బంధువుకు ఇస్మాయిల్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బృందాలతో పాటు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.