ఇవాళ ఏపీ ఓపెన్‌ స్కూల్స్‌ ఫలితాల విడుదల

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్స్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఓపెన్ స్కూళ్లల్లోని పది, ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ సొసైటీ.

ఇందులో బాగంగానే ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల కానున్నాయి. www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ సొసైటీ. ఇక ఈ ఓపెన్ పదో తరగతి అలాగే ఇంటర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా.. మొన్న పదవతరగతి పరీక్షలు విడుదల చేసిన అనంతరం పెద్ద వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు… చాలావరకు ఫెయిలయ్యారు. వారందరిని మళ్లీ పాస్ చేయాలని ప్రతిపక్షాల నుంచి ఏపీ సర్కార్ పై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలోనే… ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు అలాగే ఇంప్రూమెంట్ అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news