ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనివల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బలహీనపడిన అల్పపీడనం ఉత్తర కోస్తాపై కేంద్రీకృతమైంది. దీనివల్ల కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అటు…తెలంగాణ ప్రజలకు అలర్ట్..ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిబరీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది.