ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు… కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, YSR, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక అటు తెలంగాణకు కూడా వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.