ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు !

-

ఏపీ ప్రజలకు చల్లటి కబురు. ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉన్న, పశ్చిమ మధ్య బంగాళా ఖాతం & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం, సగటు సముద్ర మట్టం మీద 1 . 5 కి .మీ & 3 . 6 కి .మీ మధ్య వ్యాపించి ఉన్నది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉండనున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర:ఈరోజు , రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర:ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.
రాయలసీమ : ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version