Big Boss Non Stop: ‘బిగ్ బాస్’ నుంచి మహేశ్ విట్టా ఔట్..ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ఆరో సీజన్ ‘ఓటీటీ’ వర్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఏడో వారం వీకెండ్ ఆదివారం ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేషన్ జరిగింది. ఈ క్రమంలోనే ఊహించని ట్విస్టు ఇచ్చారు నాగార్జున. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బాబా మాస్టర్ ను హౌజ్ కు పంపుతున్నట్లు తెలిపారు.

Mahesh Vitta

ఆదివారం ఎపిసోడ్ నాగార్జున ఏడో వారం కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ గురించి వివరించారు. ఒక్కొక్కరిక క్లాస్ పీకారు. తమ ఆట తీరు పట్ల వివరణ ఇవ్వాలనీ అడిగాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చారు. బాబా మాస్టర్..ను వైల్డ్ కార్డ్ ద్వారా హౌజ్ ఎంట్రీ చేయించారు. ఇక కెప్టెన్ గా వ్యవహరించిన అషురెడ్డి తప్పులను పేర్కొంటూ చాలా పాపాలు చేశావని అన్నాడు. అనిల్-హమీదలో ఆట మధ్యలో ఎందుకు ఆవేశపడుతున్నట్లు అని ప్రశ్నించాడు.

ఇప్పటి వరకు హౌజ్ లో ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ ప్లేయర్స్‌గా ఉన్న అఖిల్-బిందు మాధవి బొక్క బోర్ల పడ్డారని నాగ్ పేర్కొన్నారు. అరియానా ఫుడ్ విషయంలో ఎలా వ్యవహరించిందో తెలిపాడు. ఇక అజయ్ ను కన్ఫెషన్ రూమ్ కు ఆహ్వానించి మాట్లాడాడు. ‘దుప్పట్లో ****’ అంటూ బూతులు మాట్లాడటం సబబేనా? అని ప్రశ్నించాడు. వ్యవహార శైలి మార్చుకోవాలని మందలించారు.

ఇక చివరగా ఎలిమినేషన్ రౌండ్ లో నామినేషన్స్ పరంగా హమీద, నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్టా వచ్చారు. టాస్కులో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది హమీద. కాగా, ఎవరి మట్కాలో రెడ్ కలర్ ఎక్కువగా ఎక్కువగా ఉంటే వారు ఎలిమినేటెడ్ అని నాగార్జున పేర్కొన్నారు.

అలా నటరాజ్ మాస్టర్, మహేశ్ విట్టా ఇద్దరూ చివరకు మిగలగా, నటరాజ్ మాస్టర్ సేఫ్ అయిపోయాడు. మహేశ్ విట్టా ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఎవరూ బాధపడొద్దని, తనకు బయట లక్షా తొంభై పనులు ఉన్నాయని కంటెస్టెంట్స్ అందరికీ మహేశ్ విట్టా చెప్పి బయటకు వచ్చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version