బ్రేకింగ్ : వైయస్ షర్మిల నిరాహార దీక్ష

-

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

APCC chief launches an indefinite hunger strike in support of VSP workers
APCC chief launches an indefinite hunger strike in support of VSP workers

తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ఎదుట నిరాహార దీక్షతో నిరసన చేపట్టిన షర్మిల.. కార్మికులకు మద్దతు తెలిపారు. అటు మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని ఉదయం ట్వీట్ చేయారు షర్మిల. భారతదేశ ఐక్యత కాపాడాలన్న రాజీవ్ గాంధీ గారి సిద్ధాంతమే నేడు అందరికీ ఆదర్శం. మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ గారు చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news