హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, నాంపల్లి, చార్మినార్, కోటి, అబిడ్స్, రామంతపూర్, అంబర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న తరుణంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తన్నారు అధికారులు. కాగా పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా,రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనిపైగా ఆగ్నేయ బంగాళాఖాతం నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించింది ద్రోణి. దీని ప్రభావంతో నేడు, రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
అటు ఏపీలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా రిలీజ్ చేశారు. అత్యవసర సహాయం,సమాచారం కొరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి, చిత్తూరు కర్నూలు,నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి, తూర్పుగోదావరి,పశ్చిమ గోదావరి,కోనసీమ,కృష్ణా, గుంటూరు,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.