అరకులోయలో ఉరేసుకుని..ప్రేమజంట ఆత్మహత్య !

-

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. అరకులోయలో ఉరేసుకుని..ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. నిన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది ప్రేమజంట. రాజమండ్రి హుకుంపేట ప్రాంతానికి చెందిన జ్యోత్స్న, చైతన్యగా గుర్తించారు పోలీసులు. ఇక మృతదేహాలను అరకులోయ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు.

araku incident

ఆత్మహత్య చేసుకున్న యువకుడు చైతన్య వయసు 17 సంవత్సరాలు, మృతురాలు జ్యోతి 14 సంవత్సరాలుగా పోలీసులు నిర్ధారించారు. ఇరు కుటుంబాలు గతంలో విజయనగరం జిల్లా జామిలో నివసించేవని…ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత మంగళవారం ఈ ప్రేమజంట ఇంటి వద్ద నుంచి బయలుదేరిందట. అరకులోయ మండలం కటికి జలపాతాన్ని నిన్న ఆదివారం సందర్శించి అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న కొండపై ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news