కాంగ్రెస్ లో చేరనున్న బంగారు శృతి ?

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి కలిశారు. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన బంగారు శృతికి టికెట్ దక్కకపోవడంతో నిరాశతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే..దీనిపై బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి స్పందించారు.

బిజెపి కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నమస్కారం అంటూ ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. బీజేపీ పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన గాని తప్పకుండా నేను పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ గెలవాలని కృషి చేస్తాను…పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అదైర్య పడొద్దు మన మందరం కలిసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు బంగారు శృతి. దాని గురించి నేను రేపటి నుంచి విస్తృతంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో పర్యటిస్తానన్నారు బంగారు శృతి. రాబోయే ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీని మళ్ళీ మూడవసారి గెలిపించాలి దాంట్లో మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కూడా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news