చంద్రబాబుపై రేప్ కేసు తప్ప అన్ని కేసులు పెట్టారు – అశోక్ గజపతిరాజు

-

చంద్రబాబుపై రేప్ కేసు తప్ప అన్ని కేసులు పెట్టారన్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు.  టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ పై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన అశోక్ గజపతి రాజు.. రేప్ కేసు మినహాయించి మిగిలిన అన్ని సెక్షన్లు చంద్రబాబు పై బనాయించటం ఘోరం అంటూ ఆగ్రహించారు.

ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అనే సమాధానం కూడా పోలీసులు చెప్పకపోవటం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే తీరు ఇదా అంటూ రెచ్చిపోయారు. అన్ని దేవాలయాలకు ప్రజలు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని దేవుళ్లను వేడుకోవాలని… నాలుగున్నరేళ్లలో ఒక సైకో, దొంగ కోర్టుకి వెళ్లకుండా ప్రభుత్వం జాగ్రత్త పడగలిగిందని వెల్లడించారు అశోక్ గజపతిరాజు.

Read more RELATED
Recommended to you

Latest news