స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు – ఏపీ సిఐడి

-

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడి పోలీసులు నేడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడని ప్రెస్ మీట్ లో తెలిపారు ఏపీ సీఐడీ డిఐజి సంజయ్. నేడు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశామని తెలిపారు. ఇది 550 కోట్ల స్కామ్ అని.. అగ్రిమెంట్లన్నీ చంద్రబాబు చెబితేనే జరిగాయని అన్నారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్ళించారని సిఐడి డీజీపీ సంజయ్ తెలిపారు.

కీలక డాక్యుమెంట్ల మాయం వెనక చంద్రబాబు హస్తం ఉందన్నారు. నకిలీ ఇన్వాయిస్ ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్ళించారని తెలిపారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీలు తెలుసన్నారు. చంద్రబాబు ని కస్టోడియల్ ఇంటరాకేషన్ చేయాల్సిందేనన్నారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్టు చేశామన్నారు. నిధుల దారి మళ్లింపుకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించవలసి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news