ఏపీలో దారుణం.. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

-

మానవ సంబంధాలు మంట కలిసేలా చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ప్రియుడిపై ఉన్న మోజుతో పిల్లలను కొందరు తల్లులు హత్యలు చేస్తూ ఉంటే.. మరికొందరు తండ్రులు కామంతో కళ్లు మూసుకుపోయిన కూతురితోనే పాడు పనులు చేస్తున్నారు. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తండ్రి బాధ్యత. అందులోనూ అమ్మాయి అంటే అతనికి ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి. నాన్న ఉన్నాడు అని భరోసా కల్పించాలి. కానీ ఓ కన్న తండ్రి తన కూతురి పాలిట కామపిశాచి అయ్యాడు.

సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు కు చెందిన మానసిక దివ్యాంగురాలు అయినా బాలికపై కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. తుళ్లూరు మండలం లోని ఓ గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల మానసిక వికలాంగురాలిపై జూన్ 12వ తేదీన తండ్రి అత్యాచారం చేశాడు. ఘటనపై బాధితురాలి తల్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version