రాష్ట్రం తిరోగమనంలో ఉంది. రాష్ట్రంలో గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి అని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్, సాండ్ స్కాం లు కనపడుతున్నాయి. పేకాట క్లబ్ లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పాదయాత్రలో నేను గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేశాను.
DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవినీతి, వివక్ష లేకుండా మేం ఇచ్ఛాం. మళ్ళీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యా, వైద్య శాఖలో అనేక మార్పులు వైసీపీ హయంలో వచ్చాయి. అన్నీ వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో చేయటం లేదు అని మాజీ సీఎం జగన్ అన్నారు.