డ్రామా రావు ఇష్టానుసారంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు : కాసం వెంకటేశ్వర్లు

-

హైకోర్టు మొట్టి కాయలు వేస్తే తప్ప ప్రభుత్వం స్పందించని తీరు నెలకొంది అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. విద్య, సంక్షేమం, హోం వంటి ముఖ్య శాఖలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుని పాలన గాలికి వదిలేశారు. సంక్షేమ హాస్టల్స్ అన్ని సంక్షోభ హాస్టల్స్ గా తయారయ్యాయి. ఫుడ్ పాయిజన్ తో 51 మంది విద్యార్థులు చనిపోయారు. ప్రతిపక్షాలు కుట్రలు చేసి గురుకుల పాఠశాల విద్యార్థులను చెంపుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. కుట్ర కోణం ఉందంటున్న సీతక్క ఎందుకు కుట్రలు చేదించలేకపోయారు. విద్యార్థులు చనిపోవాలనే కుట్ర కోణాన్ని చేదించలేదా సీతక్క అని ప్రశ్నించారు.

మొత్తం 38 గురుకులాల్లో పుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. పుడ్ పాయిజన్ కి ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత వహించాలి. ఢిల్లీకి, సోనియా కుటుంబానికి ఊడిగం చేసుడు తప్పితే రేవంత్ రెడ్డి శాఖలను పట్టించు కోవడం లేదు. రేవంత్ రెడ్డి వద్ద పెట్టుకున్న ముఖ్య శాఖలను ఇతరులకు కేటాయిస్తే వాళ్లైన పట్టించుకుంటారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల బతుకులు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉన్నాయి. ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్న విద్యా వేత్తలు కోదండరాం, ఆకునూరి మురళీ విద్యార్థుల మరణాలపై ఎందుకు నోరు మెదపడం లేదు. మీ పౌర హక్కులు ఎక్కడికిపోయాయి. ఇక ట్విట్టర్ టిల్లు, డ్రామా రావు, సైకో రావు ఇష్టానుసారంగా బీజేపీ, మోదీ మీద విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు, డిపాజిట్లు గల్లంతు కావడంతో ట్విట్టర్ లో ఏది పడితే అది పోస్టు చేస్తున్నారు. కేటీఆర్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కొద్దీ రోజులు చేరితే మంచిది అని కాసం వెంకటేశ్వర్లు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version