నేను BRS నుండి అందుకే బయటకు వచ్చా : కడియం

-

అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. BRS వాళ్ళు ఉద్యోగాల నియామకాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఏం చేశారు…? గాడిదలు కాసారా. విద్యా వ్యవస్థను నాశనం చేసి, బ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక హరీష్ రావుకు పిచ్చికుక్క కరిసినట్టు మాట్లాడుతన్నాడు. బోనస్ ఇస్తామంటే హరీశ్ రావు అంతా బోగస్ అంటున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ఉంది.

KCR, కేటీఆర్, హరీష్ రావు వేల ఎకరాల భూములు కొల్లగొట్టి,వేల కోట్లు సంపాదించుకున్నారు. నీతి నిజాయితీ అని బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే లేదు,పార్టీ చేసిన విధ్వంసం,అవినీతి,అక్రమాలు వల్ల వీళ్ళ పాపాలు పండుతాయని తెలిసి ఆ పాపాలు నాకు అంటోందని నేను బయటకు వచ్చా అన్నారు కడియం. అలాగే జనగాం ఎమ్మెల్యే 10 లక్షల పనిచేసిన నేను ముక్కు నెలకు రాస్తా. కేటీఆర్ కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయ్. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నాడు అని కడియం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version