రాష్ట్రంలో దారుణ ఘటనలు.. మాజీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

-

రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని మాజీ స్పీకర్ తమ్మినేని  సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ఎంపీ కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో వీటికి ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టాలనీ లేదా..? గతంలో తాను చంద్రబాబు కేబినెట్ లో పనిచేశాను. కానీ ఇలాంటివి గతంలో ఎప్పుడూ లేవు. 7 నెలల ఓట్ ఆన్ అకౌంట్ కి వెళ్ళటం భారత దేశ చరిత్రలో ఎక్కడ లేదన్నారు.

ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని పత్రికలకు లీక్ చేశాడు. గవర్నర్ ప్రసంగంలో 10లక్షల కొట్లుగా చెప్పించాడు. జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే టైంకు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో సహా రాష్ట్ర ప్రభుత్వం వద్ద 7.8 వేల కోట్లు డబ్బులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అంటే అరాచక పాలన ఆటవిక రాజ్యం అన్న బ్రాండ్ నీ ఈ 50 రోజులలో ఎస్టాబ్లిష్ చేశారు. అమ్మ ఒడి గోవిందా.. ఈ ఏడాదికి సున్నం కొట్టారు.  మిగిలి రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్,మత్స్యకార భరోసా, నిరుద్యోగ భృతి పతకాలకు ఇప్పటి వరకు అతీగతీ లేదు. ప్రజలు నిలదీస్తారని ఇప్పుడు తప్పుడు పత్రాలు విడుదల చేస్తున్నారని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version