సుమకు పబ్లిక్ గా కిస్ ఇచ్చిన స్టార్ నటుడు..!

-

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా మూవీ తంగలాన్. ఈ చిత్రం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కింది. మాళవిక మోహనన్ హీరోయిన్ నటిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది ఈ చిత్రం. ఈ తరుణంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని ప్రారంభించింది. హైదరాబాద్ లో నిన్న తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు యాంకర్ సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరించారు.

ఈ తరుణంలో నటీనటులందరినీ సుమ స్టేజ్ పైకి పిలిచి సరదాగా ఆటపట్టించింది. అలాగే తంగలాన్ కీలక పాత్ర పోషించిన నటుడు డేనియల్ ను కూడా స్టేజ్ పైకి పిలిచింది. అతనితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే సుమకు డేనియల్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆగస్టు 15న తంగలాన్ మూవీని అందరూ తప్పకుండా చూడాలని.. ఇక్కడున్న అందరూ అమ్మాయిల్లో సుమనే అందంగా ఉందని తెలుగులో మాట్లాడించింది. సుమ థ్యాంక్యూ అంటూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వగా.. వెంటనే చేయికి కిస్ ఇచ్చాడు. దీంతో సుమ షాక్ కు గురైంది. వెంటనే తనదైన కామెడీతో ఈ ఘటనను ఫన్నీగా మార్చేసింది. రాజా ఈయన మా అన్నయ్య.. త్వరలోనే రాఖీ వస్తుంది అంటూ చెప్పింది సుమ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version