చిత్తూరులో దారుణం తల్లితో సహజీవనం చేస్తూ , ఆమె కూతుర్ని అత్యాచారం చేశాడు కామాంధుడు నవీన్. ప్రియుడితో అభం శుభం తెలియని చిన్నారిని అత్యాచారం చేయడానికి సహకరించింది అమ్మాయి తల్లి. మైనర్ బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారం చేస్తున్నాడు కామాంధుడు నవీన్. ఇక నిందితుడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. చిత్తూరు నగరం మున్సిపల్ క్వార్టర్స్ లో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తోంది షాకీరా భాను అనే మహిళ.
ఆరో తరగతి చదివే కూతురుతో కలిసి ఉంటున్న షకీరాబాను… వీరితో పాటు షకీరా భాను ప్రియుడు నవీన్ సహజీవనం చేస్తున్నాడు. ఇక షకీరా భాను కూతుర్ని భయపెట్టి గత సంవత్సర కాలంగా అత్యాచారం చేశాడు నవీన్. రెండు రోజులుగా షకీరా భాను కూతురు కనిపించక పోవడంతో కనిపించని స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో నవీన్, షాకిరబాను లను పోలీసులకు అప్పగించారు స్థానికులు. పోలీసుల విచారణతో నవీన్ ఆకృత్యాలు వెలుగుకి వచ్చాయి. బాలికను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు….దీనిపై విచారణ చేస్తున్నారు.