లైంగిక‌దాడుల‌కి పాల్ప‌డిన‌వారికి మంత్రి ప‌ద‌వులా – అయ్యన్న ఆగ్రహం

-

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సెటైర్లు వేశారు. వైసీపీ నేత‌లు మ‌ద‌మెక్కిన ఆంబోతుల్లా ఊరిమీద ప‌డి మ‌హిళ‌ల మాన‌ప్రాణాలు తీస్తుంటే…వారిపై క‌నీస చ‌ర్య‌లు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డి తీసుకోవ‌డంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌హిళ‌లపై లైంగిక‌దాడుల‌కి పాల్ప‌డిన‌వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారని మండిపడ్డారు. వైకామ‌కేయుల్ని ఊరి మీదకి వ‌దిలి దిక్కులేని దిశ‌చ‌ట్టం తెచ్చారు.

మ‌హిళ‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌ ?అని నిప్పులు చెరిగారు. నందమూరి కుటుంబ సభ్యులు జోలికి వెళ్తే 150 కాదు కదా ఒక్క సీట్ నీకు రాదని జగన్మోహన్ రెడ్డికి చురలకు అంటించారు అయ్యన్న పాత్రుడు. అన్న గారి కుటుంబం పై ఎంపీ విజయసాయిరెడ్డి విపరీతమైన వాఖ్యాలు చేశారని.. జగన్మోహన్ రెడ్డి లా దోచుకునే కుటుంబం నందమూరి కుటుంబానిది కాదని తెలిపారు. పింక్ డైమాండ్ చంద్రబాబు ఇంటిలో ఉందని వాఖ్యాలు చేశారు ,ఎన్నికల తరువాత అసలు పింక్ డైమాండ్ లెదు అంటున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version