ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు మోసాల పట్ల ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పై ఆరు నెలలకి వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఈనెల 13న రైతు సమస్యలపై కార్యక్రమం పెట్టాం. కరెంటు చార్జీల పైన ఈనెల 27న కార్యక్రమం పెట్టాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం జనవరి 3న కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు జగన్.
చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు. ఎల్లో మీడియాతోను పోరాటం చేస్తున్నాము. ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద చల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడము, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడానికి ఒక పనిగా పెట్టుకున్నారు. దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలని సూచించారు జగన్.