మూడు రోజుల తర్వాత జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటివద్ద ప్రశాంత వాతావరణం ఉంది. సీపీ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న మనోజ్.. 5 గంటలకు ఏర్పాటు చేస్తానన్న మీడియా సమావేశం రద్దు చేసారు. కుటుంబ సభ్యులంతా కలిసి పంచాయితీ తెంచుకుంటామని సీపీకి చెప్పారు మనోజ్. అయితే ప్రైవేట్ వెహికిల్స్, ప్రైవేట్ సెక్యూరిటీ మొత్తాన్ని మోహన్ బాబు ఇంటివద్ద లేకుండా క్లియర్ చేసారు పోలీసులు.
ఈ క్రమంలో తన తండ్రి నీ పరామర్శించేందుకు కాంటినెంటల్ హాస్పిటల్ కి మనోజ్ వచ్చే అవకాశం ఉంది. దాంతో హాస్పిటల్ వద్ద పోలీస్ బలగాలను మోహరించారు. ఏ క్షణమైనా మనోజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మోహన్ బాబు ఇంట్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులు వెంటనే వెళ్ళిపోవాలి అని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఖాళీ చేయకపోతే తానే రంగంలో దిగుతానని అల్టిమేటం జారీ చేశారు విష్ణు.