అసెంబ్లీలో ఇవాళ మరోసారి టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య రచ్చ చేశాఢు. అసెంబ్లీలో విజిల్ వేసిన బాలకృష్ణ.. వైసీపీకి వార్నింగ్ ఇచ్చాడు. నిన్న అసెంబ్లీలో తొడ కొట్టిన బాలకృష్ణ ఈరోజు విజిల్ వేసుకొని వచ్చి హంగామా సృష్టించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో విజిల్ వేశారు.
ఇది ఇలా ఉండగా,తాజాగా ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరూ టీడీపీ సభ్యుల నుంచి సస్పెన్షన్ చేశారు. సభలో వీడియో తీసినందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బి.అశోక్ సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ముగిసేంత వరకు వీరు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అంబటి రాంబాబు టీడీపీ సభ్యుల ప్రవర్తన బాలేదని.. 20 సీట్ల కంటే ఎక్కువ రావని.. చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బాలయ్య కూడా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని చెప్పారు.
https://x.com/TeluguScribe/status/1705076939999031515?s=20