చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ పొడిగింపు

-

స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబును పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఆన్‌లైన్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి.. చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించారు. ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా.. జడ్జి.. కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాలు కోరారు. జైలులో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తికి వివరించారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని జడ్జిని కోరారు. “45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు. అని చంద్రబాబు నాయుడు న్యాయమూర్తికి తన గోడు వినిపించారు. మరోవైపు మరికాసేపట్లో సీఐడీ కస్టడీ పిటిషన్​పై విచారణ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news