నన్ను ముసలోడు అంటే..వాడికి దబిడి దిబిడే – బాలయ్య

-

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నాకు 60 సంవత్సరాలు..ముసలోడు అయ్యాడంటూ వ్యాఖ్యలు చేస్తే..వాడికి దబిడి దిబిడే అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. శ్రీ సత్యసాయి హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో కంప్యూటర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని..కాని అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని..చదువుకుంటేనే తనను సినిమాల్లోకి రావాలన్నారు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఒకవేళ సినిమాల్లో నేను రాణించ లేకపోతే చదువుకున్నా కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలనని తెలిపారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని.. కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని ఆగ్రహించారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version