జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో బనకచర్ల అంశం రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాలుగు అంశాలపైనే చర్చ జరిగిందని పేర్కొన్నారు. జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్ష సమావేశం ముగిసిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కమిటీలో రెండు రాష్ట్రాల నిపుణులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు.

బనకచర్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు చెప్పాయి… టెలిమెట్రితో ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందనేది తెలుస్తుందని పేర్కొన్నారు. కొత్త, పాత ప్రాజెక్టులపై కమిటీ ముందుకు చర్చకు వస్తాయి… కమిటీ సూచనల మేరకు నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది.