మందుబాబులకు అలర్ట్. హైదరాబాద్‌లో నేటి నుండి డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. మింట్ కాంపౌండ్‌లో స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్.

ఈ సందర్బంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ… గతంలో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేవాళ్ళం.. ఇప్పుడు డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఇటీవల మేము డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ చేస్తే, స్కూల్ బస్సు డ్రైవర్లు 25 మంది మద్యం సేవించి దొరికారన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్. ఈ తరుణంలోనే హైదరాబాద్‌లో నేటి నుండి డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు.