శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం..ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ!

-

శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్నాడు ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Basava Ramana Paisachikam, Founder and President of Srikakulam District Indian Army Calling Organization

శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5,00,000 నుండి 10,00,000 వరకు డబ్బులు తీసుకొని, మోసం చేస్తున్నాడట ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ. ఆ డబ్బులను జల్సాలకు ఉపయోగిస్తున్నాడట.

విద్యార్థులు ఉద్యోగం గురించి అడగగా, వారి కుటుంబ సభ్యులను తిడుతూ బెల్ట్‌తో దారుణంగా కొడుతున్నాడట బసవ రమణ. అయితే.. తాజాగా కొంత మంది బాధితు లను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ కొడుతున్న వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news