ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేడు వారి అకౌంట్లోకి డబ్బులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్. మే నెల పెన్షన్ డబ్బులను నేడు(శనివారం) రెండు విధానాల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 65.30 లక్షల మంది పెన్షనర్లలో 47.74 లక్షల మందికి DBT ద్వారా వారి అకౌంట్లలో జమ చేయనుంది.

Beneficiaries in Andhra Pradesh to get pensions

మిగతా 17.56 లక్షల మందికి డోర్ టు డోర్ ద్వారా సచివాలయ ఉద్యోగులు నేటి నుంచి ఈనెల 5వ తేదీలోగా పంపిణీ చేస్తారని పేర్కొంది. గత నెలలో కూడా ఇదే విధానంలో పింఛన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

  • గత నెల మాదిరిగానే పెన్షన్ల పంపిణీ చేపట్టిన ఏపీ ప్రభుత్వం….
  • బ్యాంక్ ఖాతాలకు పెన్షన్ డబ్బులు జమ
  • 65,30,838 మంది పెన్షన్ లబ్జిదారులకు రూ. 1939.35 కోట్ల మేర నిధుల విడుదల.
  • 73.11 శాతం లబ్దిదారులకు బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం.
  • బ్యాంక్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోనున్న 47,74,733 మంది పెన్షన్ లబ్దిదారులు.
  • 26.89 మేర ఉన్న 17,56,105 మంది లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ డబ్బులను అందించనున్న సచివాలయ సిబ్బంది.
  • ఇవాళ్టి నుంచి ఈ నెల 5వ తేదీలోగా పెన్షన్ డబ్బుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version