Telangana: నేడు తెరుచుకోనున్న ఇంటర్ కాలేజీలు

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్ కానున్నాయి. TGలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది.

Inter colleges to be opened today

వీటిలో 1,443 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్డ్ ఆక్యుపెన్సి భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా కాలేజీల్లోని సెకండ్ ఇయర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెలకొంది.

అటు పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదంటూ హైదరాబాద్ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర/CBSE/ ICSE పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ & బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదని… కోర్టు ఆదేశాల ప్రకారం, పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు/నోట్ పుస్తకాలు/స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే, వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version