తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమల నడక మార్గంలోని అవ్వచారి కోన వద్ద ఓ వ్యక్తి నడక మార్గంలో వెళుతూ లోయలోకి దూకాడు. దీంతో అక్కడ ఉన్న తోటి భక్తులు అతడిని గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.

అక్కడికి వెంటనే చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఆ వ్యక్తిని లోయ నుంచి బయటకు తీసి తిరుమలలోని అశ్విని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ధ్రువీకరించారు. ఆ వ్యక్తి కావాలనే లోయలోకి దూకారా లేకపోతే ఎవరైనా తోసేసారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.