మంత్రి సీతక్క తెలంగాణ మహిళలకు శుభవార్త అందజేశారు. దసరా, దీపావళి పండుగలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ చీరల పంపిణీకి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. 15 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలు దాటిన వారితో ప్రతి ఒక్కరూ మహిళా సంఘాలలో ఉండే విధంగా చూడాలని సూచించారు. 67 లక్షల మంది సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలు వ్యాపారవేత్తలుగా మారాలని కోరారు.

పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి సీతక్క పాల్గొని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. దీంతో తెలంగాణలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు దసరా, దీపావళి పండుగలకు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం ఇండియా చుట్టనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.