ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే !

-

ఏపీ స్కూల్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. ఇవాళ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు(శనివారం) సెలవు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఇటీవల వరదల కారణంగా ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు వరుసగా సెలవులు ఇచ్చారు.

Big alert for AP school students. Holiday declared for schools in several districts today

ఈ నేపథ్యంలో నేడు తరగతులు నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. కానీ, మహిళా దినోత్సవం నేపథ్యంలో సెలవును ప్రకటించారు. అటు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు 6.49 లక్షల మంది విద్యార్థులు 3,450 పరీక్ష కేంద్రాలకు హాజరవుతారు. విద్యార్థులకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news