సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ఇది పనికిమాలిన కేసు అంటూ !

-

సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. సీఎం చంద్రబాబు కేసులను సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్‌ అని వ్యాఖ్యానించారు జస్టిస్‌ బేలా త్రివేది. సిఐడి నమోదు చేసిన ఏడు కేసులు సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య.

Supreme Sensational Statement on Cancellation of Chandrababu’s Bail in Skill Case

బాలయ్య తరపు వాదనలు వినిపించడానికి సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ సిద్ధమయ్యారు. దింతో మణీందర్‌ సింగ్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు జస్టిస్ బేలా త్రివేది. ఈ పిటిషన్‌కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తాము అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ బాలచంద్ర వరాలే ధర్మాసనం. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ధర్మాసనం… ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్‌ డిస్మిస్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news