తిరుమల తొక్కిసలాటలో చంద్రబాబు సర్కార్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది న్యాయ కమిషన్.. తొక్కిసలాట ఘటనలో ఎస్పీ సుబ్బరాయుడు, అప్పటీ సీవీఎస్ శ్రీధర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయ కమిషన్.

డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్‌రెడ్డి ఉన్నతాధికారులు ఆదేశాలను పాటించలేదని వెల్లడించింది. టీటీడీ జేఈవో గౌతమిది కూడా వైఫల్యమే అని వెల్లడించింది. డీఎస్పీ రమణకుమార్, హరనాథ్ రెడ్డిపై క్రిమినల్ చర్యలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ గౌతమిపై చర్యలకు జీఏడీకి సిఫార్సు చేసింది.