విజయవాడ వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు. విజయవాడలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ వర్షాల నేపథ్యంలో తాత్కాలికంగా ఘాట్ రోడ్ బంద్ చేశారు. అటు కనకదుర్గ నగర్ వైపు భక్తుల వాహనాలను మళ్లించారు.

ఇక అటు ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. బంగాళాఖాతంలో మరింత అల్పపీడనం బలపడటంతో.. ఈ నెల 27 వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.