మాజీ మంత్రి కాకాణికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు

-

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి ఊరట లభించింది. పొదలకూరు ఎక్సెజ్ పీఎస్ (Podalakur Excise PS)లో నమోదైన కేసులో ఆయనకు బెయిల్ (Bail) మంజూరు అయింది. 2024 ఏప్రిల్ నెలలో పొదలకూరు మండలం విరువూరు సమీపంలోని రైస్ మిల్లులో మద్యం సీసాలు నిల్వ ఉన్న నేపథ్యంలో కాకాణిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో కాకాణిని ఏ9గా నమోదు చేసిన ఎక్సెజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. జులై 14న అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అప్పటి నుంచి తనకు బెయిల్ మంజూరు చేయాలని గూడూరు అదనపు మెజిస్ట్రేట్ ఎదుట కాకాణి తరపున వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఇన్నాల్టికి ఆయనకు ఉపశమనం కలిగింది.

0

ఇప్పటికే ఉన్న మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలులో ఉన్నారు. ఈ కేసులోనూ బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్సెజ్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు కావడంతో మైనింగ్ కేసులోనూ బెయిల్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news