పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ఓడినా కానీ బుద్ది రాలేదని రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడారు. దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇది సరికొత్త భారతదేశం.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి ద్వంద వైఖరే అవలంబిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ లో ఉగ్రవాదుల దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్నని అణచివేయడానికి కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ కి విశ్వాసం లేదు. కాంగ్రెస్ నేతలు పహల్గామ్ దాడుల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే.. కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మన దేశంలో మనల్నే విమర్శిస్తే.. అసలు వీళ్లు భారత్ కి మద్దతు ఇస్తున్నారా..? పాకిస్తాన్ కి మద్దతు ఇస్తున్నారా..? అర్థం కానీ పరిస్థితి నెలకొందన్నారు.