BREAKING : దొంగ ఓట్ల ఆరోపణలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట

-

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట లభించింది. రాపాక ఎన్నిక ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ పూర్తి అయింది. మార్చిలో అంతర్వేదిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో తాను ఎన్నికల్లో గెలు పొందేందుకు దొంగ ఓట్లు దోహదపడినట్లు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాపాక.

కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదుపై తాజాగా విచారణ జరిగింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాలు మేరకు రాపాక వర ప్రసాద్ తో పాటుగా మరో ఎనిమిది మందిని విచారణ చేసి, వీరి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు కలెక్టర్. ఈ విచారణలో గత ఎన్నికల్లో తాము అసలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఓట్లు వేయలేదని వైసిపి కార్యకర్తలు పేర్కొన్నారు. తాము వైకాపా కార్యకర్తలమని, అలాంటిది జనసేన తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేకు ఏ విధంగా దొంగ ఓట్లు వేస్తామని చెప్పారు కార్యకర్తలు. ఇక దీనిపై పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల కమీషన్ కు అందజేయనుంది కలెక్టర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version