అక్క బాటలోనే నేను అంటూ కాజల్ అగర్వాల్ బాటలోనే ఆమె చెల్లి నిషా అగర్వాల్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఏమైంది ఈవేళ , సోలో వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. తన అక్క కాజల్ అగర్వాల్ లాగా ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయిందని చెప్పాలి. కాజల్ అగర్వాల్ అంటేనే ఒక సెన్సేషన్.. ఈ జనరేషన్లో కూడా స్టడీగా ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్గా కొనసాగిన వారిలో కాజల్ ముందు వరుసలో ఉంటుంది. చందమామ సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఆమె మగధీర సినిమాతో మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పుడు పెళ్లయి… పిల్లలు ఉన్నా కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో అవకాశాలు దక్కించుకుంటుంది కాజల్ అగర్వాల్.
ఈ నేపథ్యంలోనే ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ఇండస్ట్రీకి పరిచయమై ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. నారా రోహిత్ తో కలిసి సోలో చిత్రంలో నటించిన నిషా అగర్వాల్ నటనకు ప్రశంసలు లభించాయి.
కానీ ఆ తర్వాత ఆమె మంచి కథలు ఎంచుకోవడంలో తడబడింది. దాంతో అన్ని ఫ్లాపులు పడ్డాయి. ఇక అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ నిషా షేర్ చేస్తున్న ఫోటోలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి.
తాజాగా ఆమె పొట్టి గౌన్ లో థైస్ చూపిస్తూ.. కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది అంతేకాదు ఇదేం ఎక్స్పోజ్ అనేంతగా తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు నిషా అగర్వాల్ పర్ఫెక్ట్ సమ్మర్ వేర్ అని కామెంట్ పెట్టింది. ఇది చూసిన చాలా మంది నిషా అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తుందా అని కామెంట్ కూడా చేస్తున్నారు. ఇకపోతే 2013లో వివాహం చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా జీవిస్తోంది.