టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు బిగ్‌ షాక్‌..!

-

TDP candidate Kolikapudi Srinivas: టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. తిరువూరు టీడీపీలో ముసలం నెలకొంది. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ మేరకు బెజవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని చిన్నిని కలిసింది తిరువూరు టీడీపీ క్యాడర్.

Big shock for TDP candidate Kolikapudi Srinivas

స్థానికంగా ఉన్న టీడీపీ నేతలను, క్యాడర్ ను పక్కనపెట్టి కొలికపూడి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొలికపూడి తీరుతో తెలుగు దేశం పార్టీకి నష్టం కలుగుతోందని అభ్యర్థిగా కొలికపూడి ఉంటే పార్టీ ఓటమి పాలవుతామని ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇదంతా చేయిస్తున్నట్టు కొలికపూడి వర్గం ఆరోపణలు చేస్తున్నారు. 10 టాటా ఏస్ వాహనాల్లో, కార్లలలో చిన్నిని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version